రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం సిరిసిల్లలోని అపరెల్ పార్క్ లో పౌర సరఫరాల శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, సహకార శాఖ, మెప్మా, రవాణా శాఖ, కార్మిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం అన్ లోడింగ్, వాహనాలు, హమాలీల సంఖ్య, గన్ని సంచులు, మూసివేసిన కొనుగోలు కేంద్రాలపై చర్చించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి అపరెల్ పార్క్ లో ధాన్యం అన్ లోడింగ్ ను పరిశీలించారు.