నేడు (సోమవారం) ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో సాయంత్రం 05:00 గంటలకు పాల్గొంటారు. అనంతరం, సాయంత్రం 5:45 నిమిషాలకు వేములవాడ పట్టణంలోని లాలపల్లిలో మరో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.