సిరికొండలో నట్టల నివారణ మందుల పంపిణీ

0చూసినవారు
సిరికొండలో నట్టల నివారణ మందుల పంపిణీ
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దూడలకు మందులు అందించి, పశువుల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. నట్టల నివారణతో దూడల్లో జీర్ణక్రియ మెరుగుపడి, ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉంటుందని పశువైద్యాధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్దం రవి, పశువైద్యాధికారి డాక్టర్ హిమజ, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ రాజ్‌కుమార్, సిబ్బంది జమున, రసూల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్