రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా డాక్టర్ నాగార్జున చక్రవర్తి నియమితులయ్యారు. అనస్థీషియా డిపార్ట్మెంట్ హెచ్ ఓ డీగా పనిచేస్తున్న డాక్టర్ నాగార్జునను, రాష్ట్ర డీఎంఈ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరీ ఈ నియామకం చేశారు. ఈ సందర్భంగా తోటి వైద్యులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.