మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదు

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 రోజుల పాటు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 71 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరిని శనివారం కోర్టులో ప్రవేశపెట్టగా, వేములవాడ మేజిస్ట్రేట్ జ్యోతిర్మయి గారు 14 మందికి జైలు శిక్ష, జరిమానాలు, 57 మందికి జరిమానాలు విధించారు. 10 మందికి రెండు రోజుల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా; ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష, రూ. 2,500 జరిమానా; మరో ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధించారు. 49 మందికి రూ. 1,500, 8 మందికి రూ. 2,500 చొప్పున జరిమానాలు విధించారు. అనంతరం పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్.ఐ రాజు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు.
