రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో వెలసిన శ్రీ దుబ్బ రాజన్న స్వామి జాతర పోస్టర్‌ను వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో రమాదేవి ఆవిష్కరించారు. జనవరి 17, 18 తేదీలలో జరగనున్న ఈ జాతర సందర్భంగా, గ్రామస్తులు, జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈవో రమాదేవి మాట్లాడుతూ, జాతరను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, జాతర కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.