రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 23వ వార్డులో బిజెపి అభ్యర్థిగా ద్వారక శ్రీదేవి ఈరోజు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నానని, 23వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ద్వారక శ్రీదేవి తెలిపారు.