రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 14 నుంచి 16, 2026 వరకు జరగనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో ఎల్. రమాదేవి ఆలయ ఉద్యోగులతో సమావేశమయ్యారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన సమ్మక్క–సారలమ్మ జాతరలో సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా విధులు నిర్వహించినందుకు అభినందించారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, మహాశివరాత్రి జాతరను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.