ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మే డే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి స్ఫూర్తితో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, వారి శ్రమతోనే నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులు రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్ల సంక్షేమానికి అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి అమలు చేస్తున్నారని, కార్మికుల హక్కులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దేశంలోని పెద్ద ప్రాజెక్టులు కార్మికుల శ్రమతోనే నిలిచి ఉన్నాయని తెలిపారు.