రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు వ్యవస్థ విచిత్ర పరిస్థితులకు దారితీస్తోంది. వేములవాడ రాజన్న ఆలయంలో మొక్కు చెల్లించుకుని గుండు చేయించుకున్న నలుగురు కూలీలను ఎన్ఎంఎంఎస్ (NMMS) యాప్ గుర్తించలేకపోయింది. దీంతో వారు హాజరైనా హాజరు నమోదు కాలేదు. సమస్యను అధిగమించడానికి, పాత ఫోటోలో ఉన్నట్లు కనిపించేందుకు విగ్గు ధరించి యాప్ ముందు నిలబడగా, హాజరు నమోదైంది. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాలలో వీడియోలు వైరల్ అయ్యాయి.