రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షాలకు ధాన్యం తడిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచనతో అధికారులు వెంటనే స్పందించి, దాదాపు 10 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని నామాపూర్ లోని బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ కు తరలించారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని అధికార యంత్రాంగం భరోసా ఇచ్చింది.