రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ సర్పంచ్ షేక్ యాస్మీన్ ఫిరోజ్ పాషా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు బావుసాయిపేటలో పల్లె ఆసుపత్రి మంజూరు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పల్లె ఆసుపత్రి మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు.