వేములవాడలో వైభవంగా గోపాష్టమి వేడుకలు

1చూసినవారు
వేములవాడలో వైభవంగా గోపాష్టమి వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని స్థానిక గోశాలలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, గోమాతలకు ప్రత్యేక పూజలు చేసి, గోగ్రాసాన్ని సమర్పించారు. రాష్ట్ర బజరంగ్‌దళ్ కన్వీనర్ శివరాములు మాట్లాడుతూ, ద్వాపర యుగంలో బాలకృష్ణుడు గోవులను అడవికి తోలుకొని వెళ్లిన పవిత్ర దినమే గోపాష్టమి అని, శ్రీకృష్ణ పరమాత్మ గోపాలుడుగా మారిన ఈ రోజును ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్