అన్నం మిగిలిందా? పారవేయకండి.. పంచిపెడదాం

3చూసినవారు
అన్నం మిగిలిందా? పారవేయకండి.. పంచిపెడదాం
రాజన్న ఆలయం వద్ద దాదాపు 200 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను పారవేయకుండా పంచిపెట్టాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు. ప్రతి అన్నం మెతుకుపై దాని యజమాని పేరు రాసి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు వొడ్యాల వేణు, గజ్జెల శ్రీనివాస్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పిన్నింటి హనుమాండ్లు, సగ్గు రాహుల్, పసుల శ్రీధర్, రాచకొండ నందయ్య తదితరులు పాల్గొన్నారు.