మంగళవారం, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథులుగా హాజరై నూతన తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి ఆటల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి, వారిని అభినందించారు. అలాగే, ఉద్యోగ విరమణ పొందుతున్న డీఈఓ
జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయుడిని సన్మానించి, వారి సేవలను కొనియాడారు. విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే తెలిపారు.