వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గత ఎన్నికల్లో తన కోసం కూరగాయల బండిపై ప్రచారం చేసిన కదురు బాలయ్య ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలు అందజేశారు. ఎన్నికల్లో తన గెలుపునకు భాగస్వామ్యం కావడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. బాలయ్య బైక్ పాడైపోయిందని తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే అతనికి కొత్త బైక్ (XL) కొనిచ్చి సోమవారం అందజేశారు. ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా నియమితులయ్యారు.