వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీభీమేశ్వరస్వామి వారిని మంగళవారం రాత్రి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. పాక్షిక చంద్రగ్రహణం ముగిసిన తర్వాత స్వామివారిని దర్శించుకుని పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను ఆశీర్వదించారు. ఆయన వెంట ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అధికారులు, నాయకులు కూడా ఉన్నారు.