రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి, నూతన వస్త్రాలు అందజేశారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎన్నో కుటుంబాలకు సంతోషాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.