నూతన పాఠశాల భవనం మంజూరు చేయండి: సర్పంచ్

0చూసినవారు
నూతన పాఠశాల భవనం మంజూరు చేయండి: సర్పంచ్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన సర్పంచ్ జిన్న అనూష-అనిల్ కుమార్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గరిమ అగర్వాల్‌ను కలిశారు. గ్రామంలోని పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని, వర్షాకాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫోటో ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. నూతన పాఠశాల భవనం మంజూరు చేయాలని వినతి పత్రం అందజేయగా, కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులను పిలిచి పాఠశాలను పరిశీలించి, నూతన భవనానికి ఎస్టిమేషన్ వేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్