భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని ఎస్సి కాలనీ ప్రాథమిక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పాలతో నివాళులర్పించారు. బాలికా విద్య, బలహీన వర్గాల విద్య, స్త్రీల హక్కులు, సమాజంలోని అసమానతలపై సావిత్రిబాయి పూలే చేసిన పోరాటాన్ని ప్రధానోపాధ్యాయులు భార్గవి వివరించారు. విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని చదువులో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భార్గవి, రామస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.