అగ్రహారం డిగ్రీ కళాశాలలో.. హరితాన్ ఇకో -2025 సదస్సు

2చూసినవారు
అగ్రహారం డిగ్రీ కళాశాలలో.. హరితాన్ ఇకో -2025 సదస్సు
సిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ సహకారంతో శుక్రవారం హరితాన్ ఇకో హ్యాక్తాన్-2025 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. శంకర్ అధ్యక్షత వహించగా, నిపుణులు కే సురేష్, ప్రొఫెసర్ టి. వేణుగోపాల్ ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. 15 మంది విద్యార్థులు ఈ-వ్యర్థాల నిర్వహణపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను 4R (రెఫ్యూస్, రెడ్యూస్, రీసైకిల్, రీయూస్) పద్ధతిలో నిర్వహించాలని డాక్టర్ శంకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్