రాజన్న గుడి పరిసర ప్రాంతంలో భారీ నాగు పాము ప్రత్యక్షం

4చూసినవారు
రాజన్న గుడి పరిసర ప్రాంతంలో భారీ నాగు పాము ప్రత్యక్షం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ పరిసరాల్లో ఆదివారం సాయంత్రం భారీ నాగుపాము కనిపించడంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ జగదీష్‌ను సంప్రదించగా, ఆయన హుటాహుటిన చేరుకొని చాకచక్యంగా నాగుపామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ప్రస్తుతం రాజన్న ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్