వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు నమిలికొండ రాజేశ్వర్ శర్మ తెలిపారు. ప్రదోషకాలంలో దీపాలు వెలిగించేవారికి మోక్షం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కార్తీక మాసం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారికి అనుబంధ దేవాలయమైన భీమన్న గుడిలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమంలో సుహాసినులు పాల్గొని దీపాలు వెలిగించాలని కోరారు. కార్తీక మాసంలో ఆలయంలో దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని తెలిపారు.