ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వేములవాడలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. శుక్రవారం ఆమె జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆలయ ఈఓ రమాదేవి, అధికారులు, అర్చకులతో కలిసి జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. 15వ తేదీన మహా శివరాత్రి జాతర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జాతర సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ప్రణాళిక ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.