కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి, ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయంలో లఘు దర్శనం కల్పిస్తున్నారు. భక్తులు రాజన్నతో పాటు భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కోడె మొక్కులు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కళ్యాణం వంటి మొక్కులు చెల్లించుకుంటున్నారు.