రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం గోవిందరావుపేట గ్రామపంచాయతీకి చెందిన 11 స్వశక్తి మహిళా సంఘాలు, నాలుగు గ్రూపులుగా ఏర్పడి హమాలీలుగా సేవలందిస్తున్నాయి. కల్లాల్లో ధాన్యం తూకం వేయడానికి హమాలీల కొరత ఏర్పడటంతో, మహిళలు స్వయంగా ముందుకు వచ్చి ధాన్యం తూకం వేయడం, ట్రాక్టర్లలో లోడ్ చేయడం, మిల్లుల్లో అన్లోడింగ్ చేయడం వంటి పనులు చేపట్టి ఆదర్శంగా నిలిచారు.