మౌలిక సదుపాయాలు తనిఖీ చేయాలి: ఇంచార్జి కలెక్టర్

0చూసినవారు
మౌలిక సదుపాయాలు తనిఖీ చేయాలి: ఇంచార్జి కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ రిటర్నింగ్ అధికారులకు (ఆర్ ఓ) ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈ సీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని, ప్రతి ఆర్ ఓ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, విద్యుత్, నీటి వసతి వంటి సదుపాయాలు కల్పించాలని గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ట్యాగ్స్ :