శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న జబర్దస్త్ నటుడు ఫణి

0చూసినవారు
శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న జబర్దస్త్ నటుడు ఫణి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ హాస్య నటుడు కవులూరి వెంకట ఫణి కుమార్ అలియాస్ జబర్దస్త్ ఫణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని, పూజలు ముగించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు జి. రాజేందర్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ జబర్దస్త్ ఫణికి శేష వస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్