వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వర ఆలయంలో శనివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దీపోత్సవం అనంతరం అర్చకులు, వేద పండితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు వెలిగించిన కార్తీక దీపాలు ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.