కార్తీక మాసం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమన్న గుడిలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. సాంప్రదాయ దుస్తుల్లో సుహాసినిలు దీపాలు వెలిగిస్తూ దర్శనమిచ్చారు.