దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు లఘు దర్శనం ద్వారా రాజన్నను, కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకోవడానికి భీమన్న గుడిని దర్శించుకుంటున్నారు. దీంతో రెండు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు తెల్లవారుజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించారు.