భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిక్కాల రామారావు తనయుడు అశ్విన్ రావు ఆకస్మిక మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అశ్విన్ రావు మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న కేటీఆర్, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అశ్విన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.