కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు వేములవాడ రూరల్ మండలం పాజిల్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదులు, పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల తిరుపతి మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ పార్లమెంటులోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించబడిందని, బండి సంజయ్ కుమార్ కు ప్రభుత్వ పాఠశాల పిల్లల పట్ల అపారమైన ప్రేమ ఉందని తెలిపారు.