పోలియో రహిత గ్రామంగా పల్లిమక్తను తీర్చిదిద్దుదాం

0చూసినవారు
పోలియో రహిత గ్రామంగా పల్లిమక్తను తీర్చిదిద్దుదాం
కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామపంచాయతీలో సర్పంచ్ జిన్నా అనుష అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్