భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు ప్రారంభం

2చూసినవారు
భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం పరిశుభ్రత పనులు, ప్రత్యేక పార్కింగ్, చలువ పందిళ్లు, తాత్కాలిక టెంట్లు, టాయిలెట్లు, విద్యుత్ దీపాలు, అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్