రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో పాటు మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని అవసరమైన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఈ వైద్య శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది.