*స్కానింగ్ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షించాలి

485చూసినవారు
*స్కానింగ్ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షించాలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో, స్కానింగ్ సెంటర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, పిండ హత్యలను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆడ, మగ పిల్లలు సమానమేనని, పిండ హత్యలు లింగ నిష్పత్తిపై ప్రభావం చూపుతాయని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లింగ నిర్ధారణ పరీక్షల పరిణామాలపై అవగాహన కల్పించడానికి రేడియాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్