రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గీతే మాట్లాడుతూ, న్యూ ఇయర్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేలు, అధిక శబ్ద పరికరాలపై పూర్తి నిషేధం విధించామని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే యజమానులు, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని, జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.