రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో శుక్రవారం సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాభ్యాసంలో వెనుకబడిన పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేయనున్నారు. ట్రస్ట్ నిర్వాహకులు పిల్లీ బాబురావు తెలిపిన వివరాల ప్రకారం, వేములవాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ సహాయ కార్యక్రమం చేపడుతున్నారు. ట్రస్ట్ స్థాపన నుంచి విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నామని బాబురావు పేర్కొన్నారు.