జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

2చూసినవారు
జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, జనవరి 1 నుండి 31 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కాలంలో పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని, డి.జే.ల వినియోగంపై కూడా ఆంక్షలు విధించబడ్డాయని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించి, శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్