వర్షాలు సమృద్ధిగా కురిసి, లోక కళ్యాణం జరగాలని పూజలు

1097చూసినవారు
ప్రస్తుతం నెలకొన్న అనావృష్టి, వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విశ్వహిందూ పరిషత్ (VHP) లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ, సకాలంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండాలనే సంకల్పంతో భగవంతు రావు నగర్‌లోని శ్రీ గాయత్రి మాత ఆలయంలో శనివారం ప్రత్యేక యజ్ఞాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమంలో వేద పండితులు మంగళకరమైన వేద మంత్రోచ్చారణల నడుమ పవిత్ర హోమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్