ప్రధాని మోదీ స్పూర్తితో ప్రోగ్రామ్

0చూసినవారు
భారత ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన స్ఫూర్తితో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు 'మనబడి మన బాధ్యత' కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం మరిపెళ్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదులు, పరిసరాలను అధికారులు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ పాఠశాల ఇంచార్జ్, మండల ప్రధాన కార్యదర్శి తోట శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ 'బేటి బచావో బేటి పడావో' కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.