ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

3చూసినవారు
ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చిన 149 అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అన్ని దరఖాస్తులను ఆన్లైన్లో పూర్తిగా పరిష్కరించాలని, పెండింగ్ పెట్టవద్దని, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, డీఆర్డీఓ, హౌసింగ్, ఎస్డీసీ, డీపీఓ, డీఈఓ, డీఎంహెచ్ఓ, సెస్, మున్సిపల్ కమిషనర్, ఉపాధి కల్పన అధికారి, డీసీఎస్ఓ, ఎక్సైజ్ ఆఫీసు, డీసీఓ, ఫారెస్ట్ అధికారి, రిజిస్ట్రార్, డీఎస్సీడీఓ, డీవీహెచ్ఓ, ఆర్టీసీ, జిల్లా సంక్షేమ అధికారి, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎల్ డీ ఎం వంటి వివిధ శాఖలకు అర్జీలు అందాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్