వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం అర్హులైన 40 మంది లబ్ధిదారులకు 14 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.