రేపటి నుంచి పల్స్ పోలియో

2చూసినవారు
రేపటి నుంచి పల్స్ పోలియో
సిరిసిల్ల జిల్లాలో రేపు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో 0-5 సంవత్సరాల వయస్సు గల 41,147 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో 358 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.