రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం పల్స్ పోలియో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చారు.