రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో అమలును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సంపత్, జిల్లా డేటా మేనేజర్ కార్తీక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హై రిస్క్ ప్రాంతాలు, గుడిసెలు, ఇటుక బట్టీలు, వలస కార్మికులు నివసిస్తున్న ప్రాంతాలు, తాత్కాలిక నివాస ప్రాంతాలలో పోలియో బూత్‌ల వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న తీరును వారు పరిశీలించారు. బూత్‌ల వద్ద వ్యాక్సిన్ నిల్వలు, కోల్డ్ చైన్ నిర్వహణ, వ్యాక్సిన్ క్యారియర్లు, మార్కింగ్ విధానం, ట్యాలీ షీట్లు, నమోదు వంటి అంశాలను అధికారులు సమీక్షించారు.