రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 391 కేంద్రాల్లో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, ఇవి సురక్షితమైనవని, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత అవసరమని సూచించారు.