మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు: ఎమ్మెల్యే

1చూసినవారు
మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు: ఎమ్మెల్యే
వేములవాడ: రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల నిర్లక్ష్యం వహించారని, నామమాత్రంగానే కొనుగోళ్లు జరిగాయని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా చర్యలు చేపట్టిందని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్