రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఏర్పడడంతో ప్రజలు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి అధిక ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించినా, ఈదురుగాలులు ఇబ్బందులు సృష్టించాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.